VIDEO: పులివెందులలో కొండచిలువ ప్రత్యక్షం..!
KDP: పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని రాణి తోపు సమీపంలో ఓ కొండ చిలువ కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. శుక్రవారం ఓ రైతు భూమిని చదునుచేసే పనులు చేపట్టిన సమయంలో ట్రాక్టర్ గునపానికి చుట్టుకుని బయటకు వచ్చింది. అది ఒక కుందేలును చుట్టుకొని ఉంది. రైతులు విషయాన్ని అటవీ అధికారులకు తెలిపారు. అధికారులు కొండ చిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలారు.