కిడ్నీ రాకెట్ కేసు.. ఇద్దరు అరెస్ట్
AP: అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్ వ్యవహారం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నీ మార్పిడి చేస్తున్న బెంగళూరు వైద్యుడు పార్థసారధి రెడ్డికి సుమన్, కొండయ్యలు ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లుగా పని చేసేవారని వెల్లడించారు. కాగా కిడ్నీ శస్త్ర చికిత్స చేయించుకున్న యమున అనే యువతి మృతి చెందడంతో ఆస్పత్రిని మూసివేసిన సంగతి తెలిసిందే.