రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
SRPT: గరిడేపల్లి మండల పరిధిలోని పొనుగోడు శివారులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. మండలంలోని అప్పన్నపేటకి చెందిన సిద్దయ్య (45) అనే వ్యక్తి మోటార్ సైకిల్‌పై వెళుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కల్టివేటర్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన సిద్దయ్యను ఆసుపత్రికి 108లో తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయినట్లు తెలిపారు.