గ్రామానికి నూతన బస్సు సౌకర్యం

గ్రామానికి నూతన బస్సు సౌకర్యం

SRCL: ఇల్లంతకుంట మండలం బోటి మీది పల్లె గ్రామంలో ఆదివారం, నూతన బస్సు సౌకర్యం ఏర్పాటు చేయబడింది. గ్రామ సర్పంచ్ గౌరవేని శ్రీవాణి సుమన్, ఉపసర్పంచ్ గౌరవేణి లతికా నరేష్, పాలకవర్గం, మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ కృషితోనే ఈ సౌకర్యం సాధ్యమైందని సర్పంచ్ తెలిపారు. గ్రామస్తులు ఈ బస్సు సౌకర్యం కల్పించినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.