రివ్యూయర్లపై జీవిత రాజశేఖర్ ఫైర్
'బైకర్' సక్సెస్ మీట్‌లో రాజశేఖర్ భార్య జీవిత రాజశేఖర్ మూవీ రివ్యూయర్లపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. మూవీ ఎలా తీయాలో రివ్యూయర్లనే అడుగుదామా అనిపిస్తోందని తెలిపింది. సెంటిమెంట్ ఉంటే మెలోడ్రామా అని, స్టైలిష్‌గా తీస్తే డెప్త్ లేదని విమర్శిస్తున్నారని, అసలు ఏది నమ్మాలో అర్థం కావడం లేదంటూ ఆమె మండిపడింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్ అయ్యాయి.