గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపిన మంత్రి స్వామి
ప్రకాశం: ఏసుక్రీస్తు శిలువ మరణాన్ని క్రైస్తవులు అత్యంత పవిత్రంగా జరుపుకునే రోజును గుడ్ ఫ్రైడేగా పిలుస్తారని మంత్రి స్వామి అన్నారు. ఇది ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం అని చెప్పుకొచ్చారు. మానవాళి పాపాల కోసం క్రీస్తు చేసిన త్యాగానికి సిలువ వేయడం ప్రత్యేకంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులందరికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు.