పట్టణంలో వైభవంగా బోనాల వేడుకలు

పట్టణంలో వైభవంగా బోనాల వేడుకలు

వనపర్తి పట్టణంలో మంగళవారం బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మూడు రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్న లెక్కచేయకుండా వర్షంలోనే మహిళలు ఇంటికో బోనంతో డప్పుచప్పుళ్ల మధ్య కుటుంబ సభ్యులతో ఊరేగింపుగా వెళ్లి చిట్యాల రోడ్డులోని పోచమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.