'జూన్ 14న జరిగే లోక్ అదాలత్ విజయవంతం చేయాలి'

NRPT: ఈ నెల 14న జరిగే లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ అన్నారు. లోక్ అదాలత్ నిర్వహణపై శుక్రవారం నారాయణపేట కోర్టు మీటింగ్ హాలులో పోలీసులు, ఎక్సైజ్, కోర్టు అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు లోక్ అదాలత్ పై అవగాహన కల్పించాలన్నారు. 6500 కేసులు పరిష్కారం లక్ష్యంగా పని చేయాలని చెప్పారు.