గీతం రేడియాలజీ సదస్సులో ఏఎంసీ విద్యార్థుల ప్రతిభ
VSP: విశాఖ గీతం విశ్వవిద్యాలయంలో నిర్వహించిన రేడియాలజీ రాష్ట్ర స్థాయి సదస్సు సోమవారం ఘనంగా ముగిసింది. ఈ సదస్సులో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు నిర్వహించిన పరిశోధన పత్రాలు, పత్రికల ప్రదర్శనలో ఏఎంసీ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు బహుమతులు సాధించారు. రాష్ట్ర స్థాయిలో డా.జీ. పుష్పిత ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని అందుకున్నారు.