జమ్మికుంట - కరీంనగర్ రహదారిపై ధర్నా

జమ్మికుంట - కరీంనగర్ రహదారిపై ధర్నా

KNR: వీణవంక మండలం నర్సింగాపూర్లో ధాన్యం తూకం వేయడానికి స్థానిక హమాలీలు రేటు పెంచాలని డిమాండ్ చేయడంతో రైతులు బీహార్ కూలీలను తీసుకువచ్చారు. దీనిపై స్థానిక హమాలీలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, తూకం పనులు నిలిచిపోయాయి. దీంతో రైతులు ఆగ్రహంతో రహదారిపై ధర్నా, రాస్తారోకో చేశారు.పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, రైతులతో మాట్లాడి వారిని శాంతింపజేశారు.