విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: సీఐ
PLD: సత్తెనపల్లి పట్టణంలోని నాగార్జున కాలనీ బీసీ బాయ్స్ హాస్టల్‌లో మంగళవారం పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఐ నాగ మల్లేశ్వరరావు హాజరై విద్యార్థులకు వివిధ అంశాలపై సూచనలు చేశారు. విద్యార్థులు మాదకద్రవ్యాలు, చెడు వ్యసనాల నుంచి పూర్తిగా దూరంగా ఉండాలని, ఇవి భవిష్యత్తును దెబ్బతీసే ప్రమాదముందని హెచ్చరించారు.