నామినేషన్ సెంటర్‌ను పరిశీలించిన DPO
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల క్లస్టర్ నామినేషన్ సెంటర్ ను జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర రావు మంగళవారం పరిశీలించారు. రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ స్వీకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయుటకుతగు సూచనలు చేశారు. మండల పంచాయతీ అధికారి వేదాల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, హర్షత్ లు పాల్గొన్నారు.