CMRF చెక్కులు పంపి చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: ప్రభుత్వం పేదల వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ 101 మంది లబ్ధిదారులకు రూ.82 లక్షలు చెక్కులను అందచేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ పాల్గొన్నారు.