ఘనంగా అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం

W.G: మొగల్తూరు ఫోటోగ్రాఫర్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఫోటోగ్రఫీ డే దినోత్సవం నిర్వహించారు. జాక్విన్ లూయిస్ డాగురె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మొగల్తూరు యూనియన్ అధ్యక్షుడు వీ.రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు శేషు, గొల్ల. డేవిడ్, సత్యనారాయణ, తోట చిట్టిబాబు, మల్లుల.సత్య, కే.రాము తదితరులు పాల్గొన్నారు.