పత్తి ధరలో ఎలాంటి మార్పు లేదు
KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి గరిష్ట ధర గత మూడు రోజులుగా నిలకడగానే కొనసాగుతుంది. దీంతో అధికారులు ధరలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని రైతుల కోరుతున్నారు. బుధవారం యార్డుకు 338 క్వింటాళ్ల విడిపత్తిని రైతులు తీసుకొని రాగా.. గరిష్ఠంగా క్వింటాకు రూ.7,250, కనిష్ఠంగా రూ.7,000 ధర లభించిందని మార్కెట్ అధికారులు తెలిపారు.