భారీగా 'కెమికల్' మామిడి పండ్లు సీజ్
TG: HYD గోషామహల్‌లో రసాయనాలతో మామిడి పండ్లను పండిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. తక్కువ సమయంలో రంగు రావడం కోసం ఇథైలిన్ వంటి ప్రమాదకర రసాయనాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. వీటిని తింటే జీర్ణ సమస్యలు, ఇతర ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందట. ఈ మేరకు పలు గోదాములపై దాడులు నిర్వహించిన పోలీసులు.. భారీ ఎత్తున నిల్వ ఉంచిన కల్తీ మామిడి పండ్లను గుర్తించారు.