అంతర్జాతీయ కరాటే పోటీల్లో సత్తా చాటిన మంథని విద్యార్థిని

PDPL: మలేషియాలోని హైపోసిటీ స్పోర్ట్స్ కౌన్సిల్ హాల్‌లో ఈ నెల 9వ తేదీ నుండి 12 వరకు నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన మెట్టు హాసిని తన సత్తా చాటింది. జపాన్ షిటోరియు కరాటే అకాడమీ శిక్షకులు కావేటి సమ్మయ్య పర్యవేక్షణలో 19 ఏజ్, 66 కేజీలు కథ విభాగంలో బంగారు పతకం, కుమితే విభాగంలో వెండి పథకం సాధించింది.