IPLలోనే తొలిసారి.. జెర్సీ నెంబర్ రిటైర్
IPL 2014-25 మధ్య 11 సీజన్లపాటు తమ జట్టుకు విశేష సేవలు అందించిన అండ్రీ రసెల్ కోసం KKR కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న జరిగిన 'KKR అన్‌ప్లగ్డ్' ఈవెంట్‌లో జెర్సీ నెం.12ను రిటైర్ చేసి.. అతనికి ఘన వీడ్కోలు పలికింది. IPLలో ఓ ఫ్రాంచైజీ ఇలా చేయడం ఇదే తొలిసారి. కాగా ఈ సీజన్ ముందు రసెల్ 'పవర్ కోచ్'గా KKR సపోర్ట్ స్టాఫ్‌లో చేరిన సంగతి తెలిసిందే.