నేడు బేస్తవారిపేటలో పవర్ కట్

నేడు బేస్తవారిపేటలో  పవర్ కట్

ప్రకాశం: బేస్తవారిపేట, పాపాయిపల్లి గ్రామాల ట్రాన్స్‌ఫార్మర్‌లు 11కేవీ AB స్విచ్ ఏర్పాటు చేయడం వల్ల పట్టణంలో ఇవాళ కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ ఎస్ ఎస్ రావు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని చెప్పారు. ఈ అంతరాయానికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.