నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎస్పీ, కలెక్టర్

BHPL: భూపాలపల్లి పట్టణంలో గణపతి నిమజ్జనం సందర్భంగా ధర్మవాహిని గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక స్వాగత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉత్సవ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే సన్మానించారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.