నేడు వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
NLR: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమం సంబంధించిన పత్రాలను జిల్లా నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపే కార్యక్రమం నెల్లూరులో సోమవారం జరగనుంది. ఈ సందర్భంగా నగరంలో బైకులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.