కలెక్టరేట్‌లో సత్యసాయి జయంతి ఉత్సవాలు

కలెక్టరేట్‌లో సత్యసాయి జయంతి ఉత్సవాలు

ఏలూరులోని గౌతమీ సమావేశ మందిరంలో ఆదివారం శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి, డీఆర్ వి.విశ్వేశ్వరరావు హాజరై.. బాబా చిత్రపటానికి పూలమాలలు వేశారు. మనుషుల్లో ప్రేమ ఉన్నంతకాలం సత్యసాయి బాబా మన మధ్యే ఉంటారని, ఆయన చూపిన సేవా మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆమె ఆకాంక్షించారు.