పరీక్షల నోటిఫికేషన్ విడుదల

శ్రీకాకుళం జిల్లాలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ B.Tech 6వ సెమిస్టర్ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ పీజీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్.శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు పరీక్షా ఫీజులు 13వ తేదీలోపు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించాలన్నారు. పరీక్ష ఫీజు మొత్తం రూ.1,050/-లు చెల్లించాలని పేర్కొన్నారు.