రామతీర్థంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
విజయనగరం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉత్సవమూర్తులు పల్లికిలో కల్యాణ వేదిక వద్దకు ఊరేగింపుగా చేరుకున్నారు. అర్చకులు సీతారామలక్ష్మణులకు అష్టకలశ స్నపనం నిర్వహించారు. కాగా, మరి కాసేపట్లో సీతారాముల కల్యాణ మహోత్సవం ప్రారంభంకానున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.