భైరవకోనలో పటిష్టమైన బందోబస్తు
ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన భైరవకోనలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం భారీ సంఖ్యలో భక్తులు చేరే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఎస్సై వెంకటేశ్వర్లు నాయక్ భైరవకోనాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అయితే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యేక ఏర్పాట్లు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.