'సీఎంకు అవార్డు రావడం రాష్ట్రానికే గర్వకారణం'
VZM: సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం తెలిపారు. వాణిజ్య రంగంలో విస్తృత సంస్కరణలు తీసుకొస్తూ, ప్రతి కుటుంబానికో పారిశ్రామిక వేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారన్నారు. అవార్డును అందుకున్న తొలి రాజకీయ నాయకుడిగా చరిత్ర సృష్టించారన్నారు.