మాచర్లలో రేపు ఐటీఐ అప్రెంటిస్ మేళా
PLD: మాచర్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో గురువారం అప్రెంటిస్ మేళా జరగనుందని బుధవారం ప్రిన్సిపల్ నరేంద్రనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేళాలో ఐటీఐ పాసైన (అన్ని ట్రేడ్‌ల) విద్యార్థులు అర్హులని చెప్పారు. ఈ మేళాకు వివిధ రకాల ప్రముఖ కంపెనీలు హాజరవుతున్నాయని, ఐటీఐ పాసైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.