అసలు యుద్ధం 2028లో ఉంటుంది: KTR
TG: రాజకీయాల్లో గెలుపోటములు సహజమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. బానిసత్వం లేని ఒకే ఒక్క పార్టీ గులాబీ పార్టీ అని చెప్పారు. అసలు యుద్ధం 2028లో ఉంటుందన్నారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రజాపక్షంలో బయటపెడదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో KCR సీఎం కావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు.