దొంగతనం కేసులో ముద్దాయికి జైలుశిక్ష, జరిమానా

VZM: 2019లో జరిగిన దొంగతనం కేసులో ముద్దాయి టీ. శంకరరావుకు 2 సంవత్సరాల 5 నెలలు జైలుశిక్ష, రూ.1500 జరిమానా విధించినట్లు శృంగవరపుకోట సీనియర్ సివిల్ జడ్జి బీ.కనకలక్ష్మి బుధవారం తీర్పు వెల్లడించినట్లు జామి ఎస్సై వై.వీరజనర్ధాన్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు జామి దొండపర్తి జంక్షన్ కే.సత్యవతి ఇంటిలో మధ్యాహ్నం సమయంలో దొంగతనానికి పాల్పడినట్లు చెప్పారు.