వేసవిలో నీటి కష్టాలు రావొద్దు: కలెక్టర్

వేసవిలో నీటి కష్టాలు రావొద్దు: కలెక్టర్

SRPT: జిల్లాలో వేసవి త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు 'ప్రత్యేక డ్రైవ్' నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. బోర్ల మరమ్మతులు, ట్యాంకుల క్లీనింగ్ పూర్తి చేయాలన్నారు. జల సేవలో లోపాలను గుర్తించి జేజేఎం డాష్‌బోర్డ్‌లో నమోదు చేయాలని అన్నారు.