నెల్లూరులో ఘనంగా దీపోత్సవ పూజ
నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం పురస్కరించుకొని బుధవారం విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారికి అభిషేకం తదితర పూజా కార్యక్రమాలను ఘనంగా చేపట్టారు. అంతరం రాత్రి దేవస్థానం ఆలయ ఆవరణలో దీపోత్సవ పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.