వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం

SKLM: వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, శారీరక ధృడత్వం సాధ్యమవుతుందని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద అన్నారు. నగరంలోని మండలవీధి జంక్షన్‌లోని ఓ జిమ్‌లో శ్రీకాకుళం బాడీబిల్డర్స్ అసోసియేషన్ జిల్లా లోగోను డీఎస్పీ శుక్రవారం ఉదయం ఆవిష్కరించారు. యువత ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని చెప్పారు.