యుద్ధం.. విమాన సర్వీసులు రద్దు
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్ వెళ్లే విమానాలను ఇండిగో, ఎయిరిండియా సంస్థలు రద్దు చేశాయి. ప్రయాణికులు విమానాశ్రయానికి వచ్చే ముందే తమ ఫ్లైట్ స్టేటస్‌ను ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.