పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన
ATP: గుంతకల్లులోని పలు వార్డుల్లో ఆదివారం పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ నయీమ్ అహ్మద్ మాట్లాడుతూ.. ప్రజలు తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలియజేశారు. ఎక్కడబడితే అక్కడ చెత్తను పారవేయకుండా చెత్త బండికి ఇవ్వాలని ప్రజలకు సూచించారు.