పోషకాహారంపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

పోషకాహారంపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

KMR: లింగంపేట మండలం పోతాయిపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సందర్శించారు. పిల్లల పేరెంట్స్, బాలింతలు, గర్భిణులు, కౌమార బాలికలకు పౌష్టికాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కిచెన్ గార్డెన్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, పెయింటింగ్ లేని కేంద్రాల్లో తక్షణమే పనులు పూర్తి చేయాలని సూచించారు.