VIDEO: తౌషిక్ మృతి కేసు.. 13 ఫోన్లు స్వాధీనం
ప్రకాశం: సింగరాయకొండ చైతన్య స్కూలులో అనుమానాస్పదంగా మృతి చెందిన తౌషిక్ కేసును పోలీసులు ముమ్మరం చేశారు. పునఃవిచారణలో భాగంగా పోలీసులు మొత్తం 13 సెల్ఫోన్లను సీజ్ చేశారు. పాఠశాలకు సంబంధించిన వారి ఫోన్లు, సింగరాయకొండ పోలీసుల ఫోన్లో సైతం స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటా ఆధారంగా కేసు ఒక కొలిక్కివచ్చే అవకాశం ఉంది.