‘రోజుకు 30 కి.మీ హైవే.. 2 లక్షల స్టార్టప్‌లు’
భారత్ ప్రస్తుతం మౌలిక సదుపాయాల కల్పనలో దూసుకుపోతోందని PM మోదీ అన్నారు. ప్రతిరోజూ 30 కిలోమీటర్ల హైవేలు నిర్మిస్తున్నామని, దేశంలో 160 ఎయిర్‌పోర్టులను నిర్మించామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 2 లక్షల స్టార్టప్‌లు నడుస్తున్నాయని, పీఎం కిసాన్ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తున్నామని చెప్పారు. గత పాలకులు అభివృద్ధిని పట్టించుకోలేదని మండిపడ్డారు.