విమానం దిగుతూ తడబడిన ట్రంప్‌

విమానం దిగుతూ తడబడిన ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం దిగేటప్పుడు ఆయన తడబడుతూ, రెయిలింగ్ పట్టుకుని జాగ్రత్తగా నడుస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతకుముందు ఒక కార్యక్రమంలో కూర్చునేందుకు కూడా ఆయన ఇబ్బంది పడటం గమనార్హం. ఈ దృశ్యాలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.