VIDEO: 'పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలి'

VIDEO: 'పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలి'

ELR: వర్జీనియా పొగాకు కేజీకి రూ. 400 గిట్టుబాటు ధర చెల్లించాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కెవి. రమణ డిమాండ్ చేశారు. గురువారం జంగారెడ్డిగూడెం ధర్మన్న మెమోరియల్ హాల్లో సమావేశం నిర్వహించారు. పొగాకు వేలం ప్రారంభంలో కేజీకి రూ. 265 ఇవ్వడాన్ని ఖండించారు. గత సంవత్సరం కేజీకి రూ. 400 ధర ఇచ్చి ఇప్పుడు సగానికి తగ్గించడం బాధాకరమన్నారు.