'సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి'
KRNL: క్రిమిసంహారక మందులకు దూరంగా ఉంచి సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ అధికారి జిలానీ బాష అన్నారు. ఇవాళ మండల పరిధిలోని విరుపాపురం, బిలేహల్ గ్రామాల్లో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు సాగు చేసిన మిరప, వేరుశనగ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన వివరించారు.