నిత్య అన్నదాన ట్రస్ట్‌కు రూ.1 లక్ష విరాళం

నిత్య అన్నదాన ట్రస్ట్‌కు రూ.1 లక్ష విరాళం

CTR: వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం నిత్య అన్నదానం ట్రస్ట్‌కు రూ.1,00,116 విరాళాన్ని శ్రీ సుబ్రహ్మణ్యం రెడ్డి కుటుంబ సభ్యులు అందజేశారు. మైనగుండ్లపల్లి, తవణంపల్లి మండలం వాస్తవ్యులైన దాతలకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రవి పాల్గొన్నారు.