కొండగట్టుకు పవన్ కళ్యాణ్ రాక.. అభివృద్ధికి బాట!

కొండగట్టుకు పవన్ కళ్యాణ్ రాక.. అభివృద్ధికి బాట!

JGL: ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకతో కొండగట్టు ఆలయ అభివృద్ధికి బాటలు పడనున్నాయి. ఆంజనేయ స్వామి వెలసిన కొండపై నిద్రిస్తే అనారోగ్య సమస్యలు దరిచేరవనే నమ్మకంతో వచ్చే భక్తులకు, కొండపైకి చేరుకోగానే సరైన గదులు లేక ఆలయ పరిసరాల్లో నేలపై నిద్రిస్తూ అవస్థలు పడుతున్నారు. భక్తుల మొర ఆలకించిన పవన్ 96 గదుల సత్ర నిర్మాణానికి శనివారం భూమి పూజ చేయనున్నారు.