నేడు విద్యుత్ అంతరాయం

JGL: మద్దుట్ల, రాంపూర్ సబ్ స్టేషన్ పరిధిలో చెట్ల కొమ్మలు తొలగించనున్న నేపథ్యంలో సోమవారం విద్యుత్ సరఫరా నిలిపేయనున్నట్లు విద్యుత్ ఏఈ ఆకునూరి శ్రీనివాస్ తెలిపారు. మద్దుట్ల, రాంపూర్, గొర్రెగుండం, రామన్నపేట, వడ్డెరకాలనీ, ఒబులాపూర్ గ్రామాల్లో ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు కరెంట్ ఉండదన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.