నూతన ఉపాధ్యాయులకు సర్వీసు రిజిస్టర్లు అందజేత
NDL: ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని యూటీఎఫ్ సీనియర్ నాయకులు వై. మనోహర్ అన్నారు. మంగళవారం బేతంచెర్ల పట్టణంలో ఎమ్మార్సీ నందు యూటీఫ్ అధ్యక్ష, కార్యదర్శులు మద్దిలేటిరెడ్డి, వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి సర్వీస్ రిజిస్టర్లు అందచేశారు. మండలంలో 76 ఖాళీలకు 2025 డీఎస్సీ ద్వారా 44 పోస్టులు భర్తీ అయ్యాయని తెలిపారు.