రేపు జిల్లాకు రానున్న సీఎం
BDK: రేపు భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. కాగా ఏటా గోదావరి వరదలకు రైతులు అనేక రకాలుగా నష్టపోతున్నారు. ఈసారైనా సీఎం గోదావరి వరదలపై స్పందిస్తారా అనేది చూడాలని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.