రైతులంటే చంద్రబాబుకు చిన్నచూపు: కైలే
AP: రైతులంటే చంద్రబాబుకు చిన్నచూపు.. విపత్తులో నష్టపోయిన రైతులను ఆదుకునే పరిస్థితి కూడా లేదంటూ వైసీపీ నేత కైలే అనిల్ కుమార్ మండిపడ్డారు. తుఫాన్‌ను కూడా పబ్లిసిటీ కోసం వాడుకున్న వ్యక్తి చంద్రబాబు.. నష్టపోయిన రైతులను మాత్రం కనీసం కూడా పట్టించుకోలేదంటూ ఆయన నిలదీశారు. పంట నష్టం అంచనాలతో కూడా రైతులను దగా చేస్తున్నారని ఆరోపించారు.