VIDEO: నిలిచిన పంటు, పడవ రాకపోకలు

W.G: వశిష్ట గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో నరసాపురం వద్ద పడవ, పంటు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఇరు జిల్లాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చించినాడ వంతెన మరమ్మతుల వల్ల ఇప్పటికే మూసివేయడంతో ప.గో, కోనసీమ జిల్లాల మధ్య వాహనాల రాకపోకలు స్తంభించాయి. అధికారులు గట్లు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలు వేసి, పరిస్థితిని సమీక్షిస్తున్నారు.