తొలి టెస్టు నుంచి తెలుగు ప్లేయర్ ఔట్

తొలి టెస్టు నుంచి తెలుగు ప్లేయర్ ఔట్

తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో గాయం కావడంతో.. టీ20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. నిజానికి, అతడు దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే, నితీశ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదన్న కారణంతో.. టీమిండియా యాజమాన్యం అతన్ని మొదటి టెస్టు జట్టు నుంచి ఇప్పుడు పూర్తిగా తప్పించింది.