'కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి'

SRD: పటాన్ చెరువు రుద్రారంలో ఉన్న తోషిబా DC బ్యాటరీల తయారీ కంపెనీ యాజమాన్యం ప్రభుత్వ, కార్మిక చట్టాలను తుంగలోకి నెట్టి, కార్మికులకు పని గంటలు పెంచి శ్రమ దోపిడి చేస్తుందని CITU జిల్లా నాయకుడు కే రాజయ్య తెలిపారు. కార్మికుల సమస్యల సమగ్ర సర్వే చేయడంతో ఈ విషయాలు బయటపడ్డాయని ఆయన అన్నారు. ఇప్పటికైన కనీస వేతన చట్టాన్ని తోషిబా కంపెనీ యాజమాన్యం అమలు చేయాలన్నారు.