డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో.. 46 మంది అనర్హులు
నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడలో 46 మంది లబ్ధిదారులను డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో అనర్హులుగా అధికారులు గుర్తించారు. వారి స్థానంలో ‘ప్రజా పాలన’ దరఖాస్తుల ద్వారా అర్హులైన వారిని పారదర్శకంగా డ్రా ద్వారా ఎంపిక చేశారు. త్వరలో మొత్తం 552 మంది లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు ఆర్డీవో అశోక్ రెడ్డి, హౌసింగ్ పీడీ రాజ్ కుమార్ తెలిపారు.